‘డిజే టిల్లు’కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. విమల్‌తో కలిసి సిద్ధు కూడా స్క్రిప్ట్ వర్క్‌లో పాలు పంచుకున్నారు. టిల్లు పాత్ర కోసం తన నటన, ఆహార్యం మార్చుకున్నారు సిద్ధు. అదే యువతలో ట్రెండ్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో నేహాశెట్టి(Neha Shetty), ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.30కోట్ల వసూళ్ల రాబట్టింది.తనదైన డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో ‘డీజే టిల్లు’(DJ Tillu)గా హిట్ కొట్టాడు హీరో సిద్ధు జొన్నలగొడ్డ. తాజాగా డీజే టిల్లు 2 వస్తుందనడంతో సిద్దు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో కూడా నేహా శెట్టి ఉండాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు.