ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఆయన చిన్నపాత్ర చేసిన అది.. హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడని చిరంజీవి సక్సెస్ మీట్లో వెల్లడించారు.
ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. భారీ ధరకు ఈసినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళ భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం అయ్యినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక గాడ్ ఫాదర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్, చిరంజీవి చెల్లిగా కనిపించారు. ఆమె గతంలో చిరంజీవ సరసన సైరాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. Photo : Twitter