Chiranjeevi As God Father - Salman Khan: మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా షూటింగ్లో సల్మాన్ ఖాన్ అయ్యారు. అంతేకాదు డైరెక్టర్ మోహన్ రాజా.. ఈ సినిమాలో సల్మాన్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం. (Twitter/Photo)
గాడ్ ఫాదర్ షూటింగ్ 60 శాతం కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్లో సల్మాన్ ఖాన్ జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా పూర్తయినట్టు సమాచారం. (Twitter/Photo)
ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్లో సల్మాన్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. (Twitter/Photo)
ఇక ముందుగా ఈ పాత్ర కోసం పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో నయనతార యాక్ట్ చేస్తోంది ఇక ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక .. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29 వ తేదిన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన యాక్ట్ చేసింది. (Twitter/Photo)