లింగుసామి, అతని సోదరుడు సుభాష్ పేరు మీద తిరుపతి బ్రదర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ సంస్థ పేరు మీదుగా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఇద్దరిపై కేసు నమోదైంది. చెన్నై కోర్టు ఇచ్చిన తీర్పుపై లింగుసామి సోదరులు అపీల్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారట. మరి చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.