మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది.. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. మరో 5 రోజుల్లోనే ఇది పూర్తి చేసి ప్యాకప్ చెప్పనున్నాడు క్రిష్. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో అందరికీ తెలుసు.. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కూడా చేస్తున్నాడు. దాంతో పాటు వైష్ణవ్ తేజ్ సినిమాను కూడా మధ్యలో తీసుకొచ్చాడు.
పవన్ డేట్స్ కుదరకపోవడం.. మధ్యలో కరోనా కూడా రావడంతో ఇటు వచ్చేసాడు క్రిష్. వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు క్రిష్. సినిమా అంతా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. వర్షం వచ్చినా కూడా బ్రేకుల్లేకుండా ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు క్రిష్.
రకుల్ కూడా ముంబై నుంచి పూర్తిగా హైదరాబాద్కు మకాం మార్చేసింది. ఇక్కడే నెల రోజులుగా ఉండిపోయింది. మధ్యలో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది. అప్పుడు మాత్రమే ఆమె ముంబై వెళ్లి అధికారుల ముందు హాజరై మళ్లీ వచ్చింది. ఆ ఒక్క బ్రేక్ మినహాయిస్తే మధ్యలో అస్సలు బ్రేకులు తీసుకోలేదు దర్శక నిర్మాతలు.
కరోనాతో పాటు భారీ వర్షాలు వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పని పూర్తి చేస్తున్నాడు క్రిష్. ఇందులో రైతు బిడ్డ, గొర్ల కాపరిగా నటిస్తుంది రకుల్. కెరీర్లో తొలిసారి పూర్తిగా డీ గ్లామర్ లుక్లో కనిపించనుంది రకుల్. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే వైష్ణవ్ తొలి సినిమా ఉప్పెన ఇంకా విడుదల కాలేదు.