100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి, ఎందరో హీరోల కెరీర్ నిలబెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు 78 ఏళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకోనున్నాడు. ఔను. నిజంగానే రాఘవేంద్రరావు చుట్టూ తిరిగే ఓ స్టోరీలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. (File/Photo)
2/ 6
నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే, ఇదేదో సందేశాత్మక సినిమా కాదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నారు.
3/ 6
ఈ సినిమాలు నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. వారిలో ముగ్గురు హీరోయిన్లు ఇప్పటి వరకు ఫైనల్ అయినట్టు సమాచారం. సమంత, శ్రియ, రమ్యకృష్ణలు కూడా ఈ సినిమాలో నటించనున్నట్టు తెలిసింది. (file/photo)
4/ 6
తన సినిమాలతో రమ్యకృష్ణకు గ్లామరస్ ఇమేజ్ తీసుకొచ్చిన రాఘవేంద్రరావు ముఖ్యపాత్రలో నటిస్తున్న సినిమా ఇది కావడం ఇక్కడ విశేషం. (Image: Instagram)
5/ 6
తెలుగులో టాప్ హీరోయిన అయిన సమంత కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండడం, ఈ ప్రాజెక్టుకు మరింత ఇంపార్టెన్స్ వచ్చింది.
6/ 6
ఇక శ్రియ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తోంది. మరో హీరోయిన్ ఫైనల్ చేయాల్సి ఉంది. కొత్త అమ్మాయిని తీసుకుంటారని తెలుస్తోంది.