DIRECTOR BOYAPATI SRINU COMPLETED 15 YEARS IN TOLLYWOOD FILM INDUSTRY TA
Boyapati@15 Years: దర్శకుడిగా 15 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న బోయపాటి శ్రీను..
Boyapati Srinu | ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయకల తర్వాత ఆ రకంగా మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను. ఇప్పటి వరకు అందరు బడా స్టార్ హీరోలతో సినిమాలు తీసాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌తో మాత్రమే జయ జానకి నాయక సినిమా తీసి హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు.సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఈయన మొదటిసారి డైరెక్టర్ చేసిన ‘భద్ర’ ఇదే రోజు విడుదలైంది. ఈ రకంగా దర్శకుడిగా టాలీవుడ్లో 15 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.ఈ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి నట సింహా బాలకృష్ణతో హాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను (Twitter/Photo)
2/ 33
సరిగ్గా 15 ఏళ్ల క్రితం బోయపాటి శ్రీను మొదటి సారి డైరెక్ట్ చేసిన భద్ర సినిమా మే 12వ తేదిన 2005లో విడుదలైంది. (Twitter/Photo)
3/ 33
దర్శకుడి 15 ఏళ్ల ప్రస్థానంలో మొత్తంగా 8 సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను (Twitter/Photo)
4/ 33
రవితేజతో తీసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుుకున్న బోయపాటి శ్రీను (Twitter/Photo)
5/ 33
టాలీవుడ్లో ఔట్ అండ్ ఔట్ మాస్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను (Twitter/Photo)
6/ 33
15 ఏళ్ల ఫిల్మ్ కెరీర్లో ఒక్క బాలకృష్ణతోనే రెండు సినిమాలు తెరకెక్కించాడు. ఇపుడు బాలయ్యతో మూడో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. (Twitter/Photo)
7/ 33
బోయపాటి శ్రీను తెరకెక్కించిన అన్ని చిత్రాలు మాస్ ఓరియంటెడ్ మూవీస్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. మాస్ పల్స్ తెలిసిన సిసలైన మాస్ దర్శకుడు. (Twitter/Photo)
8/ 33
ఏప్రిల్ 25న జన్మించిన బోయపాటి శ్రీను. (Twitter/Photo)
9/ 33
తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన ఫైట్స్ తెరకెక్కించే విధానం మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసింది. (Twitter/Photo)
‘భద్ర’ సినిమాలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించింది. (Twitter/Photo)
12/ 33
‘భద్ర’ మూవీ అప్పట్లో ఒక్కడు సినిమాకు చాలా దగ్గర పోలికలతో తెరకెక్కించాడని చాలా మంది బోయపాటి శ్రీనును విమర్శించారు. (Twitter/Photo)
13/ 33
‘భద్ర’ మూవీ సెట్స్‌లో రవితేజ, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, వి వి వినాయక్‌లతో దర్శకుడు బోయపాటి శ్రీను (Twitter/Photo)
14/ 33
రవితేజకు సీన్ వివరిస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను (Twitter/photo)
15/ 33
‘భద్ర’ రవితేజ కెరీర్లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. (Twitter/Photo)
16/ 33
దర్శకుడిగా బోయపాటి శ్రీను మొదటి చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
17/ 33
రెండో చిత్రం వెంకటేష్ హీరోగా ‘తులసి’ చేసారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
18/ 33
‘తులసి’ సినిమా షూటింగ్ సందర్భంగా వెంకటేష్‌తో బోయపాటి శ్రీను (Twitter/Photo)
19/ 33
చాలా రోజులుగా హిట్టు లేని బాలకృష్ణకు ‘సింహా’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గర్జించేలా చేసాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ తండ్రి కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసాడు. (Youtube/Credit)
20/ 33
ఏ హీరోతో సినిమా చేసినా.. తనశైలిలోనే హీరోలను ఎలివేట్ చేయడంతో బోయపాటి శ్రీనుది సెపరేట్ శైల్. (Twitter/Photo)
21/ 33
సింహా తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘దమ్ము’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో దమ్ము చూపించలేకపోయింది. (Twitter/Photo)
22/ 33
‘దమ్ము’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు సూచనలు చేస్తోన్న బోయపాటి శ్రీను (Twitter/Photo)
23/ 33
నట సింహా నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రెండు కేంద్రాల్లో 1000 రోజులకు పైగా నడవడం విశేషం. డిజిటల్ యుగంలో ఓ చిత్రం ఓ థియేటర్లో ఇన్ని రోజులు నడవడం ఓ రికార్డు. (Twitter/Photo)
24/ 33
అల్లు అర్జున్‌తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ కూడా ఓ రేంజ్లో ఇరగదీసింది. ఈ చిత్రం బాలీవుడ్లో అల్లు అర్జున్‌కు ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. (Twitter/Photo)
ఎపుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే బోయపాటి శ్రీను కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ సినిమా చేసి హిట్టు అందుకున్నాడు. (Twitter/Photo)
27/ 33
రామ్ చరణ్‌తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ అందరి అంచనాలు తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
28/ 33
వినయ విధేయ రామ షూటింగ్ సందర్భంలో రామ్ చరణ్‌కు బోయపాటి శ్రీను సలహాలు (Twitter/Photo)
29/ 33
బోయాపాటి శ్రీను ఏ హీరోతో రెండో సినిమా కూడా చేయలేదు. కానీ బాలకృష్ణతో రెండు సినిమాలు తెరకెక్కించి ఇపుడు ముచ్చటగా హాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. (Photo : Twitter)
30/ 33
బాలకృష్ణతో తెరకెక్కించిన సింహా, లెజెండ్ సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసాడు. ఇపుడు ముచ్చటగా మూడో సినిమాలో కూడా నందమూరి నట సింహం డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యాక్షనిపస్ట్ పాత్ర. రెండోది అఘోరా క్యారెక్టర్. (File/Photo)
31/ 33
బాలకృష్ణతో చేస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా కారణంగా అన్ని సినిమాల వలే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. (Twitter/Photo)
32/ 33
బోయపాటి శ్రీను సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. రెండోది అఘోరా పాత్ర అని చెబుతున్నారు. ఇప్పటికే కాశీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేసారు. (Twitter/Photo)
33/ 33
త్వరలో చిరంజీవి, మహేష్ బాబులతో సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో బోయపాటి శ్రీను (Twitter/Photo)