ఈ సినిమాలో బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారన్నారు దిల్ రాజు.టీనేజీలో ఒక అమ్మాయి, కాలేజీలో ఒక అమ్మాయి.లైఫ్లో ఒక అమ్మాయి ఇలా చైతుకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారన్నారు దిల్ రాజు. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక్క హీరోయిన్ సరిపోదని.. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలని దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిల్ రాజు అక్కినేని ఫ్యామిలీపై కామెంట్లు చేయగానే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఈలలు వేస్తూ గోల చేశారు. నాగేశ్వర్రావు గారు అయినా... నాగార్జున అయినా.. నాగచైతన్య అయినా.. అఖిల్ అయినా ఒక్క హీరోయిన్ సరిపోదన్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండాలన్నారు. అలాగే థాంక్యూ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారన్నారు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సుశాంత్ కూడా నటించారన్నారు దిల్ రాజు.