కామెడీ పటాస్, ఫన్ మేకింగ్ కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూడబోతున్నాం. అదే.. F3లో పవన్ కళ్యాణ్. అదేంటి? నిజమేనా అనుకుంటున్నారు కదూ. స్వయంగా చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పాక ఇందులో నిజం లేదని ఎలా అంటాం.
ఇప్పటికే ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ చేసే కామెడీ పీక్స్‌లో ఉండబోతుందని విన్నాం. ఇంతలో చిత్రంలో పవన్ కళ్యాణ్ అప్పియరెన్స్ అనే దిల్ రాజు మాట సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికెత్తింది. విజయవాడలో చేస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టిన నిర్మాత.. చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలతో మరో ఫన్నీ ఎపిసోడ్ ఉంటుందని చెప్పి ఇంకాస్త ఆసక్తి రేకెత్తించారు.