కరోనా తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీస్ సినిమాలు విడుదల చేయడానికి వెనకాడుతుంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ ధైర్యం చేసి సినిమాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల బడ్టెట్ కూడా పెరిగింది. దీంతో ఆ ఖర్చులను ప్రేక్షకులపై రుద్దాలనే ఉద్దేశ్యంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్ పెంచుకునేలా జీవో కూడా తెచ్చుకున్నారు. (File/Photo)
ఇక పెరిగిన టికెట్స్ రేట్స్‌తో పాటు వారం పది రోజుల పాటు మల్లీప్లెక్స్‌లో రూ. 100 పెంచుకునేలా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొచ్చారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం.. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఊర మాస్ ఫాలోయింట్ ఉన్న హీరోలు ఉండటంతో ప్రేక్షకులు టికెట్ రేట్ పెంపు పట్టించుకోకుండా థియేటర్స్2కు క్యూ కట్టారు. ఆ తర్వాత మూడు వారాల గ్యాప్‌తో విడుదలైన కేజీఎఫ్ 2కు సేమ్ టికెట్ రేట్ పెంపుతో మంచి వసూళ్లనే రాబట్టింది. (Twitter/Photo)
RRR సినిమా కేవలం నైజాం (తెలంగాణ)లో రూ. 100 కోట్ల షేర్.. (రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది. భవిష్యత్తులో మళ్లీ రాజమౌళి సినిమాకు మాత్రమే ఈ ఫీట్ సాధ్యమనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు క్యూ కట్టారు. ఆ సినిమాకు ఆ టికెట్ రేట్ పెంపు బాగానే కలిసొచ్చింది. ఒకవేళ మాములు రేట్ ఉంటే కలెక్షన్స్ ఇంకాస్తా ఎక్కువగా వచ్చి ఉండేవని టాక్. మొత్తంగా టికెట్ రేట్స్ పెంపు కారణంగా ఎక్కువగా లాభ పడింది రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ సినిమాలు మాత్రమే అని చెప్పాలి. (Twitter/Photo)
తెలంగాణ ప్రభుత్వం పెంచిన రేట్స్ కారణంగా ఇక్కడ మల్టీప్లెక్స్‌లో రూ. 295 కు చేరింది. దానికి అదనంగా రూ. 50 పెంపుతో చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమాను విడుదల చేసారు. పెరిగిన టికెట్ రేట్ ఎఫెక్ట్‌తో పాటు డిజాస్టర్ టాక్‌తో ఆచార్యకు మ్యాట్నీ నుంచే హాల్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మొత్తంగా పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా సామాన్య ప్రేక్షకులతో హార్డ్ కోర్ చిరంజీవి అభిమానులు కూడా థియేటర్స్ రావడానికి ఇష్టపడలేదు. పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ ఆచార్య అనే చెప్పాలి. (File/Photo)
అటు పెరిగిన టికెట్స్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాపై పడింది. ఈ సినిమాకు ఒక వారం రోజులు పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పడింది. ఒకవేళ మాములు టికెట్ రేట్స్ ఉంటే ఈ సినిమా కు మరో రూ. 20 కోట్ల వరకు అదనంగా కలెక్షన్లు వచ్చి ఉండేవి. ఆచార్య, సర్కారు వారి పాట’ సినిమాలకు తగిలిన దెబ్బకు ఎఫ్ 3 మూవీని నిర్మించిన దిల్ రాజు మా సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు అంటూ పబ్లిసిటీ చేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా ఓవరాల్‌గా హిట్ అనిపించుకుంది. ఈ మూవీ కొన్న బయ్యర్స్‌కు మంచి లాభాలనే తీసుకొచ్చింది. (Twitter/Photo)
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో గోపీచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా కు హైప్ బాగానే ఉన్న అందుకు తగ్గ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన పంతం, జిల్ వంటి సినిమాలకు పక్కా కమర్షియల్ కంటే ఎక్కువ కలెక్షనస్ వచ్చాయి. పైగా ఈ సినిమాకు నార్మల్ టికెట్ రేట్స్ అంటూ ప్రచారం కూడా చేశారు. అయినా.. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికీ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. ఈ సినిమా కలెక్షన్స్ పై పడింది. Pakka commercial Twitter
తాజాగా రామ్ పోతినేని సినిమాకు తెలంగాణలో ఎక్కువ టికెట్ రేట్స్‌తోనే రిలీజ్ చేశారు. ఆ ఎపెక్ట్ కలెక్షన్స్ పడింది. ఒకవేళ టికెట్ రేట్ తక్కువగా ఉండి ఉంటే.. ఈ సినిమాకు మాస్లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవి. మొత్తంగా టికెట్ రేటు భారీగా ఉండటం వలన రామ్ పోతినేని ‘ది వారియర్’ కలెక్షన్స్ పై పెద్ద ప్రభావమే చూపించింది.
ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్‌లో టికెట్ రేట్స్ చూసి భయపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా లేనట్టు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రూపాయలు ఉంది. ఇక మల్టీప్లెక్స్‌లో రూ. 295 ఉంది. ఈ రేట్స్‌తో ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు మల్లీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే టికెట్స్ కే రూ. 1200 అవుతోంది. దాంతో పాటు ఇంటర్వెల్లో స్నాక్స్, కారు, బైకుతో పాటు పెట్రోల్ ఛార్జీలు కలిపితే ఎంత లేదన్నా.. రూ. 1500 నుంచి రూ. 2 వేలకు అవుతోంది. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్లు ఈ రేట్స్‌ను భరించే పరిస్థితిలో లేరు. (Twitter/Photo)
మొత్తంగా సినీ ప్రేక్షకులు పెరిగిన టికెట్స్ రేట్స్ కారణంగా థియేటర్స్‌కు వెళ్లడానికి జంకుతున్నారు. సినిమాలో ఏదో ఎక్స్ట్రార్డనరీ కంటెంట్ ఉంటేనే థియేటర్స్ వైపు చూస్తున్నారు. లేకపోతే.. నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందులే అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఏదో కొంత మంది సినీ మహా రాజ పోషకులు తప్పించి సామాన్యులు కరోనా సమయంలో అలవాటైన ఓటీటీలో చూద్దాంలే అంటూ లైట్ తీసుకుంటున్నారు. మొత్తంగా పరిస్థితులు చూస్తుంటే.. సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ అనే కాలనాగు కాటేసిందనే చెప్పాలి. (File/Photo)
అందుకే దిల్ రాజు .. థాంక్యూ మూవీని తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 112 మరియు మల్లీప్లెక్స్‌లో రూ. 177 రూపాయలకు అమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే రేట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ప్రతి తెలుగు సినిమా సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150 , మల్లీప్లెక్స్‌లో రూ. 200 మాత్రమే ఉండేలా ప్లాన్ కార్యచరణ ప్రకటించాము.
త్వరలో ఈ రేట్స్ రెండు రాష్ట్రాల్లో అమల్లోకి రానున్నాయి. ఏదైనా బిగ్ బడ్జెట్ సినిమాలకు మాత్రం ఎక్కువ రేట్స్‌తో అమ్ముకునేలా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక ఓటీటీ కూడా విడుదలైన 50 రోజు నుంచి 100 రోజుల తర్వాత కానీ ఓటీటీలో విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా చెప్పారు. (Twitter/Photo)