హైదరాబాద్ ఇప్పటికే వరస సినిమా షూటింగ్ లతో ఫిల్మ్ హబ్ గా మారింది. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ కసిటీ...అతి పెద్ద సిని స్టూడియోగా అవతరించింది. తెలుగుతో పాటు హిందీ,తమిళ, మళయాళ చిత్రాలు, అప్పుడప్పుడు హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందుకే సిటీలో మరో భారీ స్టూడియో నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారంట.