గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా...పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. (Twitter/Photo)
ఇక దిల్ రాజు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. అటు హరీస్ శంకర్.. పవన్ కళ్యాణ్‌తో చేయబోయే ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. (Twitter/Photo)