తెలుగు సినిమా అగ్ర నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తన 32వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించి హన్షిత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను, వీడియోలను పంచుకున్నారు. ఈ బర్త్ డే పార్టీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా ఘనంగా జరిగింది. నిర్మాత హన్షిత రెడ్డి స్టైలిష్ సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ బర్త్ డే వేడుకకు నిర్మాత దిల్ రాజు కూడా హాజరైయ్యారు. Photo : Instagram
హన్షిత రెడ్డి విషయానికి వస్తే.. దిల్ రాజు ఫస్ట్ వైఫ్ అనిత కుమార్తె హన్షిత రెడ్డి. ఆమె వివాహం అర్చిత్ రెడ్డితో జరిగింది. వీరికి ఓ పాప, బాబు సంతానం. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఆమె నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ సినిమా బలగం. కమెడియన్ వేణు ఈసినిమాకు దర్శకుడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్గా చేస్తోంది. Photo : Instagram
ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు. అదే వారిసు. మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన కొత్త సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Vaarasudu)గా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించాడు. Photo : Twitter.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్గా ( Rashmika Mandanna) చేసింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వావ్ అనిపించింది. Photo : Twitter..
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఏమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ విషయానికి వస్తే.. శరత్‌కుమార్ విజయ్‌కు తండ్రిగా కనిపించనున్నారు. ఒక పెద్ద కుటుంబం.. ముగ్గురు అన్నదమ్ములు. అందరిలో చిన్నవాడు విజయ్. అయితే విజయ్ ఫ్యామిలీతో జీవించకుండా.. దూరంగా ఉంటాడు. ఫ్యామిలీ ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు మాత్రం కుటుంబ వారసుడుగా విజయ్ బాధ్యత వహిస్తాడు.. Photo : Twitter.
ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో, అలాగే పలు భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో బిజీగా వున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాణంలో వారసుడుతో పాటు రామ్ చరణ్ శంకర్ సినిమా ఉంది.. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తోంది. Photo : Twitter
ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు Photo : Twitter