రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి.. సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. (Twitter/Photo)
మూడు రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్స్ వివరాలు.. నైజాం (తెలంగాణ)లో ఈ చిత్రం రూ. 1.32 కోట్ల గ్రాస్ సీడెడ్‌లో (రాయలసీమ)లో రూ. 35 లక్షలు గ్రాస్ ఆంధ్ర ప్రదేశ్ రూ. 1.48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఓవరాల్‌గా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 3.15 కోట్ల గ్రాస్ (1.70 కోట్ల షేర్ ) రాబట్టింది. మొత్తంగా రూ. 1.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోని హిట్ అనిపించుకుంది. (Twitter/Photo)
మొత్తంగా నిర్మాతగా దిల్ రాజు మసూద చిత్రాన్ని విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం మౌత్ టాక్‌తో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా దిశగా దూసుకుపోతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు.(Twitter/Photo)