మా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu), జీవితా రాజశేఖర్, రఘు బాబు, శివ బాలాజీ తదితరులు ఈ మీటింగ్కు అటెండ్ అయ్యారు. గిల్డ్ నుంచి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, భోగవల్లి బాపినీడు, 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్, 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' నుంచి వివేక్ కూచిభొట్ల తదితరులు హాజరయ్యారు.
సినిమా షూటింగ్స్ బంద్ చేయడం నుంచి ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, షూటింగుల్లో వేస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవడం, పరభాషా నటీనటుల మెంబర్ షిప్ ఫీజు తదితర అంశాలపై కీలక చర్చ జరిగిందని సమాచారం. కాస్ట్ కంట్రోల్ కోసం, రెమ్యూనరేషన్ల విషయంలో గిల్డ్ ప్రత్యేక కమిటీ వేసింది. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని తెలిసింది. ఏదేమైనా మా అధ్యక్షుడితో దిల్ రాజు అండ్ టీమ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.