మంచు విష్ణు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆ మధ్య మా ఎలక్షన్స్ కారణంగా ట్రెండ్ అయితే.. తాజాగా ఆచార్య సినిమా కారణంగా ట్రెండ్ అవుతున్నారు. దీనికి కారణం ఈరోజు మార్నింగ్ మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చిరంజీవి సినిమాకు గానీ, లేదా మెగా ఫ్యామిలీకి గానీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఒక్కసారి ఆ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్ చూస్తే మనకు అర్ధం అవుతుంది అసలు ఏం జరుగుతుందనేది. మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ.. 'డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు' అంటూ విష్ణు ట్వీట్ చేశారు. Photo : Twitter
అయితే ఈ ట్వీట్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య గురించే అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఆ కామెంట్స్ చేశారంటూ నెటిజన్స్ పలు రకాలుగా ఆయన్ను ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఆచార్యతో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని ట్రోల్ చేయడానికే పొద్దునే ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో.. అయితే చాన్నాళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఈ మధ్య మరింత ఎక్కువైంది. ముఖ్యంగా మా ఎన్నికల నేపథ్యంలో విభేదాలు మళ్ళీ మొదలయ్యాయి. Photo : Twitter
ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన 'గాలి నాగేశ్వర రావు' అనే చిత్రంలో నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు.. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. Photo : Twitter
ఇక విష్ణు కెరీర్ విషయాికి వస్తే.. అయితే ఒకట్రెండు మంచి విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు. ఇప్పటికీ తమ అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు మంచు వారసులు. ముఖ్యంగా విష్ణు అయితే ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయారు. వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మొన్నటికి మొన్న 50 కోట్లతో నిర్మించానని చెప్పుకున్న మోసగాళ్లు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. Photo : Twitter
భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు వచ్చిన రోజే చాప చుట్టేసింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు విష్ణు. Photo : Twitter
ఇక విష్ణు.. తాజాగా గాలి నాగేశ్వరరావు అంటూ మరో సినిమాకు కమిటయ్యారు. ఈ సినిమాను ఇషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా.. స్క్రీన్ ప్లే కోన వెంకట్, స్క్రిప్ట్ జి నాగేశ్వరరెడ్డి అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు'గా లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుకగా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ మార్చ్ 7న అధికారికంగా ప్రకటించింది. Photo : Twitter
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరా మెన్‌గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. Photo : Twitter
ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi ),రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. 132.50 కోట్ల టార్గెట్‌తో ఆచార్య బరిలో దిగుతోంది. Photo : Twitter
ట్రైలర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ 4 రోజుల ముందే మొదలైంది. పైగా తెలంగాణలో ఐదో ఆటతో పాటు వారం రోజుల పాటు ఈ సినిమాకు రూ. 50 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇక ఏపీలో 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ మెగా ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టు లేదనే టాక్ ప్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర తండ్రీ తనయులు రచ్చ మాత్రం అనుకున్నంత రేంజ్లో లేదని తెలుస్తోంది. Photo : Twitter
టిక్కెట్స్ రేట్స్ హైక్గా ఉండటం.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల హైప్‌తో పోలిస్తే తక్కువగా ఉందని అంటున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. Photo : Twitter