జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయిస్తూ తెగ పాపులర్ అయిన హైపర్ ఆది.. ఇతర కార్యక్రమాల్లో కూడా భాగమవుతున్నారు. ప్రతి పండగకు స్పెషల్ స్కిట్స్ వేయడంతో పాటు ప్రతుతం, ఢీ14, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్‌లో హంగామా చేస్తున్నారు. తనదైన టైమింగ్‌తో హైపర్ ఆది వేస్తున్న ఛలోక్తులు ప్రేక్షకులకు వినోదాల విందిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ హైపర్ ఆది డైలాగులు చెప్పాడంటూ సరికొత్త చర్చ తెరపైకి రావడం, నెట్టింట హైపర్ ఆదిపై ట్రోల్స్ నడుస్తుండటం పరిగణలోకి వచ్చింది. ఢీ 14కి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో తన డైలాగులతో తమ నాయకుడిపై పంచులు వేశాడంటూ హైపర్ ఆదిని విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు.
హైపర్ ఆది పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్దమైనట్లు చూపిస్తూనే.. పదునైన పంచులు వేశారు ఆది. 'వేస్తే వెయ్.. లేకపోతే...' అని పార్టీ పేరు పెట్టినట్లు పదేపదే చెప్పాడు. అదేసమయంలో అక్కడున్న ఓ ఇద్దరు కుర్రాళ్లతో మీ పార్టీ ఏంటి అని అడిగాడు ఆది. అప్పుడు వాళ్లలో ఒకరు 'మేము విన్నాం' అని ఇంకొకరు 'మేము ఉన్నాం' అని చెప్పడం దానికి బదులుగా 'సరే మేము ఉంటాం' అంటూ హైపర్ ఆది పక్కకు వెళ్లిపోవడం చూపించారు.