Dhanush Sir | తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్‌గా ఓ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుశ్.. తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. (Twitter/Photo)
తెలుగులో ‘సార్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ధనుశ్.. మరోసారి లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. టక్ వేసి ఉన్న ధనుశ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో సమకాలీన రాజకీయ పరిస్థితులను తన విద్యార్థులో ఓ సార్ ఎలా పరిష్కరించాడనే దానిపై ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. (Twitter/Photo)
తెలుగులో ‘సార్’ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం తమిళంలో మాత్రం ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమని సాయి సౌందర్య నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. (Twitter/Photo)
‘సార్’ చిత్రాన్ని శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందు కంప్లీట్ చేయనున్నారు.ఇక శేఖర్ కమ్ములతో చేయబోయే చిత్రం ‘లీడర్’ మూవీకి సీక్వెల్ అనే ప్రచారం ఉంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇక ధనుశ్.. ఒకవైపు మాస్ హీరో పాత్రలు చేస్తూనే.. ఆ తరహా పాత్రలు పరిమితం కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అందులో భాగంగా వచ్చినవే.. అసురన్, కర్ణన్ సినిమాలు. అంతేందుకు దాదాపు ఆయన సినిమాలన్ని సామాన్యుల గురించే చర్చిస్తాయి. మొత్తంగా ఇప్పటి వరకు తమిళం, హిందీ సినిమాలో ప్రేక్షకులను అలరించిన ధనుశ్.. ఇపుడు డైెరెక్ట్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డారు. (Twitter/Photo)