థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా, హిందీ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. కాగా నెట్ ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రానికి ఓ రేంజ్లో ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం మూడు బాషల్లో కూడా టాప్‌లో ట్రెండ్ అవుతూ కేక పెట్టిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.. Photo : Twitter
నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళం భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దాదాపుగా 20 కోట్ల రూపాయలకు కొన్నట్లు తెలుస్తోంది.. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి టీమ్ తాజాగా రొమాంటిక్ సాంగ్ మాస్టారు.. మాస్టారు వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. యూట్యూబ్’లో విడుదల ఈ పాట అటు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. శ్వేతా మోహన్ అద్భుతంగా పాడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. Photo : Twitter
ఇక సార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా 100 కోట్ల క్లబ్’లో చేరింది. దీంతో ధనుష్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ధనుష్ తెలుగుతో పాటు తమిళ్లో తాజాగా సార్ /వాతి సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. సార్ /వాతి సినిమా 17 రోజుల కలెక్షన్స్‌తో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. దీంతో ఒక్క ఏడాది గ్యాప్‌లో ధనుష్ ఖాతాలో రెండో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నారు. Photo : Twitter
ఇక్కడ విశేషం ఏమంటే.. ఓ హీరో తమిళ్‌తో పాటు తెలుగులో హిందీలో 100 కోట్ల గ్రాస్ అందుకోవడం ఇదే మొదటి సారట. దీంతో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఇవేవి ప్యాన్ ఇండియా సినిమాలు కావు. దీంతో ధనుష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. Photo : Twitter
ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లును రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫీస్ మొత్తంగా రూ. 13.85 కోట్ల షేర్ ( రూ. 25.96 కోట్ల గ్రాస్) వసూలు చేసి వావ్ అనిపించింది. తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్ తర్వాత ఐదో క్లీన్ హిట్‌గా ‘సార్’ నిలిచింది. ఈ సినిమా రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా రూ. 6 కోట్లను రాబట్టాలి. ఓవరాల్‌గా తెలుగులో ఇపుడు రూ. 9 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. Photo : Twitter
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగులో ఈ సినిమా ఏపీ తెలంగాణలో కలిపి 5.5 కోట్ల వాల్యూ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 6 కోట్ల షేర్ సాధించాలి. తమిళ్లో మాత్రం 35 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 415 థియేటర్స్‌లో విడుదలైంది. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మన దేశంలో చదువు అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. త్రిపాఠి ఇన్స్టూట్యూషనల్ తరుపున మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుందాం అని చెబుతారు. ఇక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్న వాడు ఈ లెక్కన కొంటాడు. తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కొంటాడు. మొత్తంగా మన తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా విద్యను వ్యాపారంగా మలిచిన కొంత కార్పోరేట్లకు ఒక సామాన్య గురువుకు మధ్య జరిగిన పోరాటంగా ఈ సినిమాను తెరకెక్కించారు. Photo : Twitter
మొత్తంగా ప్రస్తుతం విద్య అనేది డబ్బున్న వాడికి సొంతం అనే రీతిలో ఉంది. దాన్ని ఒక సామాన్యుడైన ఒక కాలేజీ సార్ ఎలా ఎదుర్కొని పోరాడి నిలుచుడానదే ‘సార్’ మూవీ స్టోరీ. గురువులు ఇపుడు కార్పోరేట్ మాయలో పడి నలిగిపోతున్నారు. ముఖ్యంగా ‘సార్’ సినిమాలో జీరో ఫీజ్.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్.. మోర్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మన సమాజంలో నడుస్తోన్న ట్రెండ్‌ను ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. Photo : Twitter
ప్రస్తుతం దేశంలో నడుస్తోన్న విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు. మన దగ్గరున్న బెస్ట్ లెక్చరర్‌ను గవర్నమెంట్ కాలేజీకి పంపిస్తే.. ఎలా అంటూ కార్పోరేట్ కాలేజీలో ఎలా వెనకుండి నడిపిస్తాయో ‘సార్’ మూవీలో చూపించారు. 90వ దశకంలో దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు గుత్తాధిపత్యం పెరిగిపోయింది. Photo : Twitter
అక్కడ ఉన్న కార్పోరేట్ విద్యా సంస్థలు ఎలా స్కూల్లతో పాటు టీజర్లను శాసిస్తున్నాయో ఈ సినిమాలో చూపించనున్నాడు. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలపై తిరగబడ్డ ఓ సామాన్య ఆచార్యుడు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. ముఖ్యంగా విద్య అనేది దేవుడి గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది అది అందరికీ పంచండి. ఫైవ్ స్టార్ హోటలో డిష్‌లాగా అమ్మకండి అని ధనుష్ చెప్పే డైలాగులు బాగున్నాయి. Photo : Twitter
ధనుష్ తెలుగులో మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆ మధ్య లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. Photo : Twitter
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తున్నట్లు టాక్. ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. Photo : Twitter