తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కొంతమంది తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్.
ఇక అది అలా ఉంటే ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు.
సార్ పేరుతో వస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తోంది. సితార బ్యానర్‌పై వంశీ నిర్మిస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు.