Home » photogallery » movies »

DHANUSH NEXT MOVIE WITH VENKY ATLURI AND TELUGU TITLE SIR TAMIL VAATI HERE ARE THE DETAILS TA

Dhanush As Sir : యంగ్ టాలీవుడ్ డైరెక్టర్‌తో మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన ధనుశ్.. అధికారిక ప్రకటన..

తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్‌గా ఓ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుశ్.. తాజాగా మరో యంగ్ దర్శకుడి చిత్రంలో నటించడానికి ఓకే చెప్పారు.