ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. ఈ మధ్యే సమంత నాగ చైతన్య విడిపోయారు. ఆ తర్వాత ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశాడు.
అయితే ఇప్పుడు ధనుష్, ఐశ్వర్యలు... రజనీకాంత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తమ విడాకుల నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆలోచనలో ఉన్నట్లు పలు నివేదికలు వస్తున్నాయి. ఈ జంట తమ విడాకులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.వారి మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవలే రజనీకాంత్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాను. తనకు ఏ మాత్రం ప్రశాంతత లేదన్నారు. కూతురు, అల్లుడు విడాకులు తీసుకున్న తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం మరింత దెబ్బతిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రజనీ మరోసారి కూతుర్ని అల్లుడ్ని కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు ధనుష్ మాత్రం తన కెరీర్లో ఫుల్ బిజీగా మారాడు. ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు తెలుగులో రెండు డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు ధనుష్. మరోవైపు తమిళంలోనూ వరస సినిమాలు చేస్తున్నాడు. హిందీ, హాలీవుడ్ నుంచి కూడా ధనుష్‌కు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన కలల సౌధాన్ని అత్యంత ఆకర్షనీయంగా నిర్మించుకుంటున్నాడు ధనుష్. దాని నిర్మాణానికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించాడు.