సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడా చూసినా కూడా ధనుష్, ఐశ్వర్య గురించే చర్చ జరుగుతుంది. చిలకా గోరింకల్లా ఉన్న ఈ జంట.. ఉన్నట్లుండి అలా విడిపోయారేంటి అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమై ఉంటుంది.. ఎందుకు విడిపోయారు అంటూ ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలా విడిపోయారు కానీ ధనుష్, ఐశ్వర్య ఎలా కలిసారు అనేది కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. వాళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పాయింట్మెంట్ దొరకడానికి కూడా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు టైమ్ పడుతుంది. ఆయన్ని కలవాలంటే అంత ఈజీ కాదు. అలాంటి రజినీ ఇంటికి అల్లుడు కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అది చేసి చూపించాడు ధనుష్. స్టార్ హీరో కానపుడే ఈయన సూపర్ స్టార్ అల్లుడు అయిపోయాడు. అలాగే అందరికీ పరిచయం అయ్యాడు కూడా.
ఒకప్పుడు చిన్న హీరోనే అయినా కూడా ఇప్పుడు మాత్రం రెండు జాతీయ అవార్డులు గెలిచి స్టార్ హీరో అయిపోయాడు. రజినీకాంత్‌కు తగ్గ అల్లుడు అనిపించుకుంటున్నాడు. ధనుష్ స్టార్ హీరో కావడానికి ముందే.. అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలోనే ఆయన సూపర్ స్టార్ అల్లుడు అయిపోయాడు. దాంతో మనోడి దశ తిరిగిపోయింది. పైగా టాలెంట్ కూడా అలాగే ఉంది ఈయనకు.
ఈ సినిమాతో ధనుష్‌కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆ సినిమా చూసిన రజినీకాంత్ పెద్దమ్మాయి ఐశ్వర్య తనకు ఓ బొకే పంపిందని తెలిపాడు. అంతేకాదు ‘గొప్పగా నటించారు. కంగ్రాట్స్.. కీప్ ఇన్ టచ్’ అని అందులో మెసేజ్ కూడా పెట్టిందని చెప్పాడు ధనుష్. అప్పట్నుంచే ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఈ ఇద్దరి మధ్య ఇంత అందమైన ప్రేమకథ నడిచింది. 18 నవంబర్ 2004న అంగరంగ వైభవంగా ధనుష్, ఐశ్వర్య పెళ్లి జరిగింది. అప్పట్లో ఈ పెళ్లి గురించి అంతా చర్చించుకున్నారు. ఈయన్ని ఎలా రజినీకాంత్ అల్లుడు చేసుకున్నాడ్రా బాబూ అన్నారు. కానీ తర్వాత రోజుల్లో రజినీకాంత్ అల్లుడు ధనుష్ అనడం మానేసి.. ధనుష్ మామ రజినీ అనే స్థాయికి కూడా ఎదిగాడు. అంత అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడంతో అభిమానులు బాధ పడుతున్నారు. ఏదేమైనా వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు.