Balakrishna: అన్స్టాపబుల్పై ఢిల్లీ హై కోర్టు నోటీస్.. ప్రభాస్ షో ప్రారంభానికి ముందు కీలక ఆదేశాలు
Balakrishna: అన్స్టాపబుల్పై ఢిల్లీ హై కోర్టు నోటీస్.. ప్రభాస్ షో ప్రారంభానికి ముందు కీలక ఆదేశాలు
Unstoppable show: అన్స్టాపబుల్పై ఢిల్లీ హై కోర్టు నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశం అయింది. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాలపై ఢిల్లీ హై కోర్టు ఓ నోటీస్ పంపిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా హోస్ట్ గా తనలోని టాలెంట్ బయటపెడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తున్నారు బాలయ్య బాబు.
2/ 8
‘అన్స్టాపబుల్’ హోస్ట్ గా బాలయ్య హవా నడుస్తోంది. ఈ షో తొలి సీజన్ నవంబర్ 4, 2021న ప్రారంభించబడి ఫిబ్రవరి 2022లో ముగిసింది. సీజన్-1 విజయవంతం కావడంతో, సీజన్-2 ఈ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ షో ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి.
3/ 8
అయితే తాజాగా ఈ అన్స్టాపబుల్పై ఢిల్లీ హై కోర్టు నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశం అయింది. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాలపై ఢిల్లీ హై కోర్టు ఓ నోటీస్ పంపిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
4/ 8
అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాలను వెంటనే నిలిపివేయాలంటూ హై కోర్టు పేర్కొంది. అన్స్టాపబుల్ షో కొన్ని ఎపిసోడ్స్ కి సంబంధించి షూటింగ్ జరుపుతున్న సమయంలోనే ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
5/ 8
ఈ వ్యాజ్యంపై విచారణ చేప్పట్టిన జస్టిస్ సంజయ్ సచ్దేవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్స్టాపబుల్ అనధికారిక ప్రసారాల వల్ల షోపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజక్షన్ ఇస్తున్నట్లు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
6/ 8
కాగా ప్రభాస్ తో చేస్తున్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు మేకర్స్. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు ముందుకు తీసుకు వస్తున్నారు.
7/ 8
ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చిన ఈ ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' అంటోంది. దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్ నేడు (డిసెంబర్ 29) రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
8/ 8
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ 2 షోకి హోస్ట్ గా చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం ఈ విజయవంతంగా రన్ అవుతోంది. గతంలో వచ్చిన అన్స్టాపబుల్ ప్రోగ్రాం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అదే ఊపులో ఈ ప్రోగ్రాం రెండో సీజన్ నడిపిస్తున్నారు.