నాగార్జున అక్కినేని కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. ఈ సినిమాని తెలుగు సహా మిగతా దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. (Photo twitter)
తాజాగా బ్రహ్మస్త్ర చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా నిన్నటి నుంచి అంటే నవంబర్ 4 నుంచి అయితే ఈ భారీ చిత్రం హిందీ తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీలో వచ్చాక ప్రేక్షకులు ఓ విషయాన్ని కనిపెట్టారు.
బ్రహ్మాస్త్రా పార్ట్ 1: అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అగ్నిని నియంత్రించే సూపర్ పవర్ ఉన్న యువకుడు శివ (రణబీర్) కథ చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం ప్రమాదంలో ఉందని శివుడు గ్రహించాడు. తెలియకుండానే, అతను విశ్వాన్ని రక్షించడానికి తన దాగి ఉన్న శక్తిని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు.