దీపికా కి బీపీ సంబంధిత సమస్య ఉంది. గతంలో కూడా ఆమె సమస్యను ఎదుర్కొంది. ఇటీవలే షూట్లోకూడా ఓ సన్నివేశశం చేసే క్రమంలో బీపితో ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది. అప్పుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా గంటలోనే మళ్ళీ ఆమె తిరిగి కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది అని క్లారిటీ ఇచ్చారు..
గతంలో బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొణేకు సమన్లు కూడా పంపారు. దీపికాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పలు కోణాల్లో వివిధ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి కూడా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.దీపికా మేనేజర్ కరిష్మాతో జరిగిన చాటింగ్ పై దీపికను ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. అంతేకాదు దీపికా డ్రగ్స్ తీసుకుందా అనే కోణంలో కూడా విచారించారు.