Deepika Padukone : దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. కాగా ఈరోజు ఆమె తన 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి నటించిన ‘83’ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. (Instagram/Photo)
దీపికా పదుకొనే (Deepika Padukone)...తన అందం,నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఈమె తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘83’లో నటించింది. ఇందులో దీపికా.. కపిల్ దేవ్ భార్య పాత్రలో నటించారు. ఇప్పటి వరకు తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన దీపికా.. 83లో మాత్రం కపిల్ భార్య రోమి పాత్రలో నటించి మెప్పించారు. (Twitter/Photo)
దీపికా 2018లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీపికా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. కన్నడ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన దీపికా పదుకొనే సల్మాన్ ఖాన్ తప్పించి మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్గా నటిస్తోంది. (Twitter/Photo)
దీపికా పదుకొణే విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ హీరోగా ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుసగా అగ్ర హీరోల సరసన నటించడంతో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. (Instagram/Photo)
వీటితో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో దీపికా పదుకొణే సింగ్ కథానాయికగా నటిస్తోంది. వీటితో పాటు హృతిక్ రోషన్, సిద్ధార్ధ్ మల్హోత్ర కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు దీపికా పదుకొణే పుట్టినరోజు సందర్భంగా ‘గెహ్రాయియా’ చిత్రంలోని దీపికా లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. (Instagram/Photo)
ఇక రణ్వీర్ సింగ్‌తో తొలిసారి ‘రామ్‌లీలా’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో నటించింది. ఆపై సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’లో టైటిల్ రోల్ ప్లే చేసింది. దీపికా పదుకొణే చివరగా ‘ఛపాక్’ సినిమాలో కనిపించింది. అంతేకాదు తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ సినిమాలో నటిస్తోంది. (Instagram/Photo)
ఆ సంగతి పక్కన పెడితే.. దీపికా పదుకొణే తండ్రి ప్రకాష్ పదుకొనే స్వతహాగా బాట్మింటన్ క్రీడాకారుడు. అంతేకాదు దేశం తరుపున బాట్మింటన్ ఆడి పలు పతాకాలు కూడా గెలిచారు. ఆ ఆధ్వర్యంలో కూతురు దీపికా పదుకొణే బాట్మింటన్ నేర్చుకుంది. సినిమాల్లో అవకాశాలు రావడంతో బాట్మింటన్ను పక్కన పెట్టింది. అయినా.. అవకాశం దొరికినపుడల్ల బాట్మింటన్ ఆడుతూనే ఉంది.(Instagram/Photo)