సరిగ్గా 25 యేళ్ల క్రితం షారుఖ్ ఖాన్.. రాజ్ మల్హోత్రగా.. కాజోల్.. సిమ్రాన్గా నటించిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై యశ్ చోప్రా నిర్మించిన ఈ చిత్రంతో ఆయన తనయుడు ఆదిత్య చోప్రా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే చరిత్ర సృష్టించాడు ఆదిత్య చోప్రా. (Twitter/Photo)
ఈ సినిమా విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీ భారతీయుల మధ్య అనుకోని సంఘటన మధ్య చిగురించిన ప్రేమకథ. విదేశాల్లో ప్రారంభమైన వీరిద్దరి ప్రేమ.. ఆ తర్వాత భారత గడ్డపై ఎలా సుఖాంతం అయిందనేదే ఈ సినిమా స్టోరీ. నచ్చినదాన్ని దక్కించుకోవడం కోసం హీరో ఎలా సఫలమయ్యాడనేదే ‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ స్టోరీ. అందుకే చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. (Twitter/Photo)
‘దిల్వాలే దుల్హనియా లేజాయింగే’ మూవీతో షారుఖ్ ఖాన్కు కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్ర కథ విన్న షారుఖ్.. ముందుగా ఇందులో నటించడానికి విముఖత చూపించాడట. కానీ ఆదిత్య చోప్రా.. షారుఖ్ ఖాన్ తప్పించి మరో హీరోను ఊహించుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాదు అతన్ని కన్విన్స్ చేసి ఈ చిత్రంలో నటించేలా చేసాడు. ఈ చిత్రం హీరోగా షారుఖ్ ఖాన్ కెరీర్నే పూర్తిగా టర్న్ చేసింది. (Twitter/Photo)
డీడీఎల్జే మూవీ ముంబాయిలోని మరాఠా మందిర్లో కంటిన్యూ 24 యేళ్లు నడిచి రికార్డు క్రియేట్ చేసింది. దేశంలో మరే చిత్రం ఇన్నేళ్లు నడిచిన దాఖలాలు లేవు. ఇది ఒక రికార్డు. ప్రస్తుతం కూడా ఆ థియేటర్లో ఈ చిత్రం రన్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ట్రెయిన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసాయి. అంతేకాదు ఎన్నో చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. (Twitter/Photo)