Siva Sankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శివ శంకర్ మాస్టర్. ఈ రోజు రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు.శివశంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. . Photo : Twitter
శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా మారింది. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇక మరోవైపు శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో ఆయనకు కూడా కొంత సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. Photo : Twitter
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా దాదాపు 800కు పైగా సినిమాలకు పనిచేశారు. కొరియోగ్రాఫర్‌గా 1975లో వచ్చిన తమిళ చిత్రం పాట్టు భరతమమ్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు.. Photo : Twitter
కొరియోగ్రాఫర్‌గానే కాకుండా శివశంకర్ మాస్టర్ పలు సినిమాల్లోనూ నటించారు. తెలుగులో ఆయన ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి, అక్షర, సర్కార్, ఎన్టీఆర్ కథానాయకుడు, రాజుగారి గది 3 వంటి దాదాపు 30 సినిమాల్లో నటించి మెప్పించారు. శివశంకర్ మాస్టర్ ఓ వైపు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తునే తెలుగు డ్యాన్స్ టీవీషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. అక్కడ కూడా తన సత్తాను చాటారు. Photo : Twitter
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మగధీర (2009) సినిమాలో ధీర ధీర పాటకు అందించిన కొరియోగ్రఫీకి ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అంతేకాదు నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులను సొంతం చేసుకున్నారు. 1996లో పూవే ఉనక్కగ, 2004లో విశ్వ తులసి, 2006లో వరలారు, 2008లో ఉలియిన్ ఓసయ్ చిత్రాలకు అవార్డులు అందుకున్నారు శివశంకర్ మాస్టర్. Photo : Twitter