ఇక అది అలా ఉంటే ఈ అమ్మడు అటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్.. అక్కడ తాను నటిస్తున్న సినిమాలతో పాటు తన అంద చందాలతో కనుల విందు చేస్తూ మరింత పాపులర్ అవుతోంది. దక్ష ప్రస్తుతం రవితేజ రావణాసురలో నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. Photo : Instagram
ఇక ఈ (Ravanasura) చిత్రంలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.ఈ సినిమాలో రవితేజ లుక్ ఇప్పటికే విడుదలవ్వగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రావణాసుర ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమప దక్కించుకున్నట్టు తెలుస్తోంది. Photo : Instagram
యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సుశాంత్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. Photo : Instagram
ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడి’సినిమా తాజాగా ఫిబ్రవరి 11న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. Photo : Instagram
ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో కనిపించారు. రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా చేస్తున్నారు. Photo : Instagram
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. వీటితో రవితేజ టైగర్ నాగేశ్వరావు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. Photo : Instagram
దక్ష నగార్కర్.. 'హుషారు'తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన 'జాంబీరెడ్డి' ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. అయితే అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం సరైనా అవకాశాలు రావాట్లేదు. అయితే ప్రస్తుతం తెలుగులో ఓసినిమాలో నటిస్తోంది. చూడాలి మరి అమ్మడికి ఇప్పటికైనా కలిసివస్తుందో లేదో.. Photo : Instagram
అందాలను విందుల వడ్డించడంలో దక్షా నగార్కర్ తర్వాతే మరెవరైనా అని అంటున్నారు నెటిజన్స్. అందుకే ఈ అమ్మడు పెద్దగా సినిమాలు లేకపోయినా తన ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. Photo : Instagram