హిందీ చిత్ర సీమలో మన తెలుగు నటీమణులు వహీదా రెహ్మాన్, రేఖ, శ్రీదేవి లాంటి వారు విజయ బావుటా ఎగరవేసారు. కానీ తెలుగు నటులు హిందీలో పేరు తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందులో తొలితరంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనకందరికీ బాగా తెలిసిన ఎల్వీ ప్రసాద్. ఈయన తొలి భారతీయ టాకీ చిత్రం ' ఆలం ఆరా 'లో రెండు, మూడు వేషాలను వేశారు. ఆయన కంటే ముందు పైడి జైరాజ్ బాలీవుడ్లో జెండా ఎగరవేసారు. (Twitter/Photo)
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో చదివి సినిమాలపై మోజుతో 1929 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. (Twitter/Photo)
పైడి జైరాజ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, సినీ ప్రయాణంపై టి.శ్రీకాంత్ ‘టు బాంబే... విత్ లవ్’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. 260 పేజీలున్న ఈ పుస్తకంలో అరుదైన ఫొటోలు జైరాజ్ జీవిత చరిత్రను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకం కాపీలు అమెజాన్లో లభిస్తాయి. పుస్తకం ధర రూ. 2000. (Twitter/Photo)