దాసాహెబ్ ఫాల్కే అవార్డు.మన దేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం.17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 52 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. ఇక కళాతపస్వీ దివంగత కాశీనాథుని విశ్వనాథ్‌తో పాటు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న భారతీ సినీ ప్రముఖులు ఎవరున్నారంటే..
52. Asha Parekh Receivs Dadasaheb Phalke Award: బాలీవుడ్లో ఒకప్పటి తరాన్ని తన అందం, అభినయంతో అలరించిన నటి ఆషా పరేఖ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకోనున్న 52వ వ్యక్తి ఆషా పరేఖ్. ఈమె కంటే ముందు ఈ అవార్డు అందుకున్న భారతీయ సినీ దిగ్గజాలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
51.2019 యేడాదికి గాను కేంద్ర ప్రభుత్వం సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా రజినీకాంత్ ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఆ పురస్కారం అందుకున్న 51వ వ్యక్తి రజినీకాంత్ కావడం విశేషం. (Twitter/Photo)
14. తొలి హిందీ టాకీ ‘ఆలం అరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళిదాసు’ వంటి సినిమాల్లో నటించిన ఏకైక వ్యక్తి ఎల్.వి.ప్రసాద్. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఫిల్మ్ స్టూడియో అధినేతగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ అధినేతగా సినిమాకు సంబంధించిన వివధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు.ఈయను (1982)లో కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. (File/Photo)
3. తొలి టాకీ ‘ఆలంఆరా’తో పరిచయమైన పృథ్వీ రాజ్ కపూర్ (1971)లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ ఫౌండర్. ఈయన ముగ్గురు కుమారులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్,శశీ కపూర్ బాలీవుడ్ అగ్ర నటులుగా కొనసాగారు. అందులో ఇద్దరు కొడుకులు రాజ్ కపూర్, శశి కపూర్ కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు ముగ్గురు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం ఒక రికార్డు. (Facebook/Photo)
1. ఫస్ట్ లేడి ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు పొందిన దేవికా రాణి (1969)లో దాదా సాహెబ్ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి దేవికా రాణి. 1933లో విడుదలైన ‘కర్మ’ అనే భారతీయ ఇంగ్లీష్ చిత్రంతో ఈమె పరిచయమైంది. భారతీయ సినిమాల్లో ఆన్ స్క్రీన్ లిస్ కిస్ ఉన్న మొదటి ఇండియన్ సినిమా ఇదే. ఈ చిత్రంలో ఆమె భర్తతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం అప్పట్లోనే సెన్సేషన్. (Facebook/Photo)