తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పుష్ప మేనియా నడుస్తుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం భీభత్సంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ప్రజాహితార్థం వాడుకుంటున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విన్నూతమైన ఐడియాలతో పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూనే ఉంటారు.
ఆ తర్వాత రాధే శ్యామ్ పోస్టర్ విడుదలైనపుడు మాస్కులు లేవా అంటూ ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తమ వంతుగా కొత్తగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోలీసులు. మరీ ముఖ్యంగా సినిమా పద్దతిలో చెప్తే వింటారని అదే రూట్లో వెళ్తున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి వాటి నుంచి ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ జాగ్రత్తలు చెప్తున్నారు.
ఈ క్రమంలోనే కొత్తగా వచ్చే సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మీమ్స్ చేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమా విషయంలోనూ ఇదే చేసారు పోలీసులు. జాగ్రత్తగా ఉండకపోతే జరిగే ప్రమాదాలను.. రూల్స్ పాటించకపోతే వచ్చే సమస్యలను ఫన్నీగా చూపిస్తున్నారు. తాజాగా 'పుష్ప' సినిమా పోస్టర్ కూడా ఇలాగే వాడుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంకల్పించారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప పోస్టర్లో బైక్‌పై హుందాగా కూర్చున్న ఫోటోను తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి అదే సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్‌తో మీమ్ చేసారు. 'పార్టీ లేదా పుష్పా' అని ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. 'హెల్మెట్.. మిర్రర్స్ లేవా పుష్ప?' అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతుందిప్పుడు.