ఈ సినిమాను ముంబైలో థియేటర్లో చూసిన నటి సదా ఎమోషనల్ అయింది. థియేటర్లో ఈ సినిమా చూస్తుండగా ఆమె కంటి వెంట నీరు ఆగలేదు. అందరూ చూస్తుండగానే ఆమె ఏడ్చేసింది. ఆ రోజు జరిగినది గుర్తు చేసుకుంటుంటే బాధేస్తోందని చెప్పిన సదా.. ఈ చిత్రంలో అడివిశేష్ అద్భుతంగా నటించాడని తెలుపుతూ ఆయన నటనపై ప్రశంసలు కురిపించింది.