త్వరత్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫ్యాన్స్‌కు బోలెడన్ని ట్రీట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఇంట్రో సాంగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న సుకుమార్.. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ అయ్యేలా ఈ సాంగ్ ప్లాన్ చేశారట. భారీ బడ్జెట్ కేటాయించి ఈ సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం.
బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్న రోల్ ఈ సినిమాలో మరింత స్పెషల్ కానుందట. అలాగే అనసూయతో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని తెలియడం ఆసక్తికరంగా మారింది.