అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో.. ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.
అతి త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో పుష్ప 1 స్టార్టింగ్ కి ముందు కూడా వచ్చినట్టుగా కాస్త ముందే ఈ సాలిడ్ సీక్వెల్ “పుష్ప ది రూల్” నుంచి కూడా ముందే లుక్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి.