అందమైన అమ్మాయి కనిపిస్తే మనసు చలించడం, ఆమెను ప్రేమించి, ఒప్పించి, పెళ్లి చేసుకోవాలనుకోవడం కామన్. కొందరైతే..హీరోయిన్స్ ని ఇష్టపడతారు. వారిని పెళ్లి చేసుకోవాలని కలలు గంటారు. సోషల్ మీడియా వేదికగా తమ కోర్కెను సదరు హీరోయిన్ కి కొందరు చేరేవేస్తుంటారు. అలాంటి అనుభవమే తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు ఎదురైంది. (Photo Credit : Instagram)
అభిమాన తారలను దగ్గరనుంచి చూడాలని మురిసిపోయే వారు కొందరైతే, కుదిరితే ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని పగటికలలు కనేవాళ్లు మరికొందరు. ఇక్కడ కూడా ఓ నెటిజన్.. తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ తన ప్రేమను ఆమెకు ఎలా వ్యక్తం చేయాలి? ఆమెను ఎలా బుట్టలో వేసుకోవాలి? అసలు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతమయ్యాడు. (Photo Credit : Instagram)