రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమా అంటేనే అందులో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏదన్నా సినిమా మొదలుపెడితే చాలు అప్పటినుంచే ఆ సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ చేసే సినిమాలన్నింటి పరిస్థితి ఇదే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తనదారి తనదే అన్నట్లుగా వెళ్తున్నారు వర్మ.
అయితే అవి తిరిగి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు దాటవేస్తూ వర్మ తప్పించుకుంటూ తిరుగుతున్నారని నిర్మాత కె. శేఖర్ రాజు ఆరోపించారు. ఈ విషయమై తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని ఆయన అన్నారు. దీంతో ఆర్జీవీ తెరకెక్కించిన లడ్కి సినిమాను అన్ని భాషల్లో నిలిపివేయాలని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసినట్లు శేఖర్ రాజు వెల్లడించారు.