తాత్కాలిక బెయిల్‌పై ఉన్న ఆమె.. తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కోసం లాయర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ఆమె తాత్కాలిక బెయిల్ గడువును నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది.అదేవిధంగా జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా నవంబర్ 10న జరపనున్నట్లు తెలిపింది.(Photo:Instagram)
తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్ ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఆమె ఏడు కోట్ల రూపాయల విలువైన వస్తువులను గిఫ్ట్‌లుగా అందుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. అందుకే ఆమెకు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కానీ, జాక్వెలిన్ మాత్రం ఆ సొమ్ము తన కష్టార్జితమని చెబుతున్నది.(Photo:Instagram)
ప్రస్తుతం ఆమె తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ ముగుస్తున్న నేపథ్యంలో ఆమె తన లాయర్ ప్రశాంత్ పాటిల్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ ను విచారించిన కోర్టు... రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారిస్తామని... అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీంతో ఆమెకు స్వల్ప ఊరట లభించినట్టయింది.(Photo:Instagram)