Bigg Boss Telugu 6 : తెలుగు వారికి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. నాగార్జున (Photo Twitter)
మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. గత సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చింది. దీనికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా చేశారు. ఈ షోలో పాల్గోన్న కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు. అందులో ముఖ్యంగా అజయ్, ఆర్జే చైతూ, అనిల్ రాథోడ్ , మిత్రా శర్మా, యాంకర్ శివలు ముఖ్యంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచారు. (Photo twitter)
ఇక లేటెస్ట్ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అసలు నిజానికి ఆగష్టు చివరి వారంలోనే ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. ఇక ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా యాంకర్ శివ ఉండనున్నారట. Photo : Twitter
ఇక మరోవైపు తెలుగు పాపులర్ సింగర్ రేవంత్ ఈ షో’లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో మొదలుకానుంది. రేవంత్ గతంలో ఇండియన్ ఐడల్ లాంటి టైటిల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌజ్‌లో ఈసారి ఎలా రాణిస్తారో చూడాలి. ఇక గతేడాది గాయకుడు శ్రీరామచంద్ర కూడా బిగ్ బాస్ షోకు వచ్చి తన పాటలతో పాటు టాస్క్‌లతో అలరించిన సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే బిగ్ బాస్ ఆరవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మొదటి పేరు ఉదయభాను. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయభాను. అంతేకాదు ఉదయభాను అనే పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకుడు ఉండరు. అంత పాపులర్ ఆమె. ఇక ఆమె త్వరలో ప్రారంభం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గోననున్నారని తెలుస్తోంది. అయితే ఈ షోలో ఆమె పాల్గోంటున్నందుకు అందరి కంటెస్టెంట్స్ కంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. Photo : Instagram
ఇక ఈ సరికొత్త సీజన్లో పాల్గోనే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో ఈ సారి 17మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్ టీమ్. అందులో భాగంగా 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారట. మిగతా ఇద్దర్నీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారని టాక్. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న లిస్ట్ ప్రకారం కంటెస్టెంట్స్‌ను చూస్తే.. Photo : Facebook
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి : పాపులర్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు చలాకీ చంటీ. ఈసారి సీజన్ సిక్స్‌లో చలాకీ చంటి కూడా ఏంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. చంటీ ఓ వైపు జబర్దస్త్‌లో చేస్తూనే.. పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ రియాలిటీ షో ఆయన కెరీర్‌కు ఏవిధంగా ఉపయోగపడుతుందో.. Photo : Youtube