CORONA POSITIVE FOR NANDAMURI BALAKRISHNA SELF DISCLOSED TDP MLA SNR
Balakrishna: నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ .. ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటన
Balakrishna: నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణైనట్లుగా ఆయన స్వయంగా వెల్లడించారు. గత రెండ్రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించారు.
కరోనా విజృంభణ మళ్లీ మొదలైనట్లుగానే కనిపిస్తోంది. తాజాగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించకోగా పాజిటివ్‌గా నిర్ధారణైంది.(ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
తాను కరోనా బారినపటినట్లుగా నటుడు బాలకృష్ణనే స్వయంగా వెల్లడించారు. అంతే కాదు గత రెండ్రోజులుగా తనను కలిసి వాళ్లు కోరనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు బాలయ్య.(ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
ప్రస్తుతం హైదరబాద్‌లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.(ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
రీసెంట్గా యోగా డే సందర్భంగా ఆయన హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన యోగా వేడుకలకు బాలయ్య హాజరయ్యారు. ఆసనాలు వేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
మరోవైపు తమ అభిమాన నటుడు బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎలా ఉందని మెసేజ్‌లు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ సీజన్ సెకండ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ టైమ్‌లో బాలకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో షో కొనసాగుతుందా లేక ఏమైనా గ్యాప్ వస్తుందానే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇటీవలే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రీసెంట్ దేశ వ్యాప్తంగా చూసుకుంటే 17,336కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.(ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
24గంటల క్రితం తెలంగాణలోనూ 484కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కాకినాడలోని ఒకే స్కూల్లో 40పాజిటివ్ కేసులు నమోదువడంతో అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. (ప్రతీకాత్మకచిత్రం)