టాలీవుడ్లో ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పనులు లేకుండా ఉన్నారు కదా. పైగా నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది. అప్పటి వరకు రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కోత తప్పదు.
పూజా హెగ్డే: టాలీవుడ్లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో అనుమానం లేకుండా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె పారితోషికం కూడా 2 కోట్లకు పైమాటే. కానీ ఇప్పుడు కరోనా కారణంగా భారీగానే ఈమె పారితోషికంలో కోత పడింది. ప్రభాస్ రాధే శ్యామ్‌తో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది పూజా. ఇకపై ఒప్పుకోబోయే సినిమాల కోసం హీరోలను బట్టి పారితోషికం తీసుకుంటుంది పూజా.
కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. రెండో సినిమాకు 30 లక్షల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఒప్పుకుంటున్న సినిమాలకు 50 లక్షల వరకు డిమాండ్ చేసినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా 30 నుంచి 40 లక్షల వరకు మాత్రమే అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి. శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాలతో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.