Samantha - Naga Chaitanya - Sri Reddy: తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో హాట్ టాపిక్ గా మారిన ఈ హాట్ బ్యూటీ అప్పటి నుంచి తన మాటలతో బాగా చెలరేగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ నటీనటులపై కూడా బాగా విమర్శలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా చై, సామ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట విడిపోతుందని తెగ ప్రచారాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం గురించి స్పందించిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంటపై తప్పుడు వార్తలను క్రియేట్ చేయవద్దు అంటూ.. వారి బ్రేకప్ గురించి పుకార్లు చేయవద్దు అని తెలిపింది. అంతే కాకుండా సమంత, చైతన్యల జంటను స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అంటూ పొగిడింది.