Sridevi Vijaykumar: టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. బాలనటిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శ్రీదేవి 'రుక్మిణి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత 'ఈశ్వర్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాలలో సహాయ నటిగా కూడా నటించింది. ఇక ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. కానీ బుల్లితెర నుండి అభిమానులకు దగ్గరగా ఉంది. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫోటో షూట్ తో బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో లంగా వోణి లో ఎంతో అందంగా ఉంది. ఇప్పటికీ తన అందంలో మార్పు లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.