అయితే కమెడియన్ సత్య... గతంలో కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్లయు చేశాడు. శ్రీకారం మూవీ ప్రమోషన్స్ లో సందర్భంగా ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సత్య రామ్ చరణ్ ఇతరులకు సహాయం చేసినా ఆ సహాయం గురించి చెప్పుకోరని అన్నారు. రామ్ చరణ్ లాంటి వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారని సత్య వెల్లడించారు.
రామ్ చరణ్ చాలామందికి ఆర్థికంగా సహాయం చేశారని సత్య అన్నాడు. తాను ఆర్టిస్ట్ గా స్ట్రగుల్ అవుతున్న సమయంలో తనకు కూడా చరణ్ డబ్బులు ఇచ్చి సహాయం చేశారని అన్నారు. అయితే చాలామందికి సహాయం చేసినా ఆ సహాయాల గురించి ప్రచారం చేసుకోవడానికి రామ్ చరణ్ అస్సలు ఇష్టపడడని కమెడియన్ గెటప్ శ్రీనుకు కూడా చరణ్ సహాయం చేశాడని సత్య తెలిపారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ళో ఆర్సీ 15లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాకు 'అధికారి' అనే టైటిల్ పెట్టాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టైటిల్ అది కాదని, 'సిటిజెన్' అనే టైటిల్ను ఖరారు చేసినట్టు సమాచారం.