అయితే కమెడియన్ ఆలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు తెరపైకి వచ్చాయి. అతడు డాక్టర్ అని అంతా అనుకున్నారు. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రీసెంట్గా డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసిందట. ఆలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయినది. ఇక ఆలీ అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టర్ అంటూ వార్తలు వచ్చాయి, అయితే అందులో నిజం లేదని ఇప్పుడు తెలిసింది.
అయితే తన అల్లుడు డాక్టర్ కాదని.. తన అల్లుడు అమెరికాలో రోబోటిక్ ఇంజనీర్ అని స్వయంగా అలీని తెలిపారు. అలీతో సరదాగా కార్యక్రమానికి అలీనే ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా సుమ అలీని ఇంటర్య్వూ చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ చాలామంది తను డాక్టర్ అని అనుకుంటున్నారు కానీ అతడు డాక్టర్ కాదని తెలిపారు.
గుంటూరులో అలీ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు సీఎంతో పాటు.. ఏపీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు, గుంటూరు sp ఆరిఫ్ హాఫిజ్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాలరెడ్డి, మాజీ mla మర్రి రాజశేఖర్ హాజరయ్యారు