Akhanda 2 : అఖండ సీక్వల్పై బాలయ్య బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటసింహం
Akhanda 2 : అఖండ సీక్వల్పై బాలయ్య బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటసింహం
Nandamuri Balakrishna: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ నేపథ్యంలో అఖండ సీక్వల్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అతిత్వరలో అఖండ 2 రానుందని కన్ఫర్మ్ అయింది.
నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంది ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన చిత్ర అఖండ. ఈ సినిమాలో బాలయ్య బాబు మాస్ యాక్టింగ్ జనం మెప్పు పొందింది.
2/ 8
సింహా, లెజెండ్ చిత్రాలతో భారీ హిట్స్ అందుకున్న బాలకృష్ణ- బోయపాటి కాంబో అఖండ రూపంలో హాట్రిక్ కొట్టారు. దీంతో ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీ అయింది. అఘోరాగా బాలకృష్ణ నటనా ప్రతిభకు అన్ని వర్గల్ ఆడియన్స్ మంత్రముగ్దులయ్యారు.
3/ 8
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ నేపథ్యంలో అఖండ సీక్వల్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు రాగా.. తాజాగా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అతిత్వరలో అఖండ 2 రానుందని కన్ఫర్మ్ అయింది.
4/ 8
తాజాగా జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్లో బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్‌కి వెళ్లిన బాలకృష్ణ.. అఖండ సీక్వల్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. అతి త్వరలోనే అఖండ సీక్వెల్ ఉంటుందని చెప్పారు బాలయ్య బాబు.
5/ 8
ఇప్పటికే అఖండ సీక్వల్ కి సంబంధించి స్క్రిఫ్ట్ వర్క్ పూర్తయిందని చెప్పిన బాలకృష్ణ.. ఈ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించాలనేది ప్రొడక్షన్ హౌస్ డిసైడ్ చేయాల్సి ఉందని చెప్పారు. సో.. ఈ లెక్కన అఖండ 2 అతిత్వరలో ప్రేక్షకులను అలరించడం ఖాయమే అని చెప్పుకోవచ్చు.
6/ 8
అఖండ సక్సెస్ తర్వాత మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. వీర సింహా రెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో మాస్ అంశాలు ఉంటాయట.
7/ 8
ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్. వీర సింహా రెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది.
8/ 8
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు.