Samantha: సమంత యశోద సినిమాకు షాక్.. కోర్టు నుంచి కీలక ఆదేశాలు
Samantha: సమంత యశోద సినిమాకు షాక్.. కోర్టు నుంచి కీలక ఆదేశాలు
Yashoda Movie: సిటీ సివిల్ కోర్టు యశోద సినిమాకు ఊహించని షాకిచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు బ్రేకులేస్తూ ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసులు జారీ చేసింది. యశోద మూవీని డిసెంబర్ 19వరకు ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. చిత్రంలో సమంత నటన ప్రతిభపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలోకి వచ్చేసింది యశోద.
2/ 8
దీంతో సమంత మరో సక్సెస్ అందుకుంది. విడుదలకు ముందు వదిలిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొని క్రమంగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది.
3/ 8
థియేటర్స్ లో యశోద సినిమా చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తుండటం సినిమాకు బాగా కలిసొస్తోంది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలియడంతో జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
4/ 8
ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు బ్రేకులేస్తూ ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసులు జారీ చేసింది. యశోద మూవీని డిసెంబర్ 19వరకు ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.
5/ 8
ఇవా ఆసుపత్రి, సరోగసీ నేపథ్యంలో ఈ యశోద సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యశోద చిత్రంలో తమ హాస్పిటల్ పేరును వాడటంతో తమ ఆస్పత్రి ప్రతిష్ఠ దెబ్బ తిందని EVA IVF యజమాన్యం కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో యశోద ప్రొడక్షన్ హౌస్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.
6/ 8
ఈ ఇష్యూపై తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేస్తున్నాయని.. అప్పటి వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు పంపించారు.
7/ 8
సమంత, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్,మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
8/ 8
ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుండటం సమంత అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.