Chiranjeevi | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోరులో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఆచార్య తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేస్తున్నాడు. దాంతో పాటు బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చిరంజీవికి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కలిసి ఓ కథ వినిపించాడట. (Twitter/Photo)
లూసీఫర్ రీమేక్ మూవీని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టేసాడు. ఆచార్య తర్వాత ముందుగా ‘లూసీఫర్’ రీమేక్‌ను ఈ నెలలోనే స్టార్ట్ చేద్దామనుకునుకుంటే.. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం వుంది. సాధ్యమైనంత తొందరలో ఈ సినిమాను స్టార్ట్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. (Twitter/Photo)
బోయపాటి శ్రీను: మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి కూడా చిరంజీవికి కథ చెప్పాడు. అయితే అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. కానీ మళ్లీ బాలయ్య సినిమా తర్వాత పట్టాలెక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ బోయపాటి శ్రీను మాత్రం కళ్యాణ్ రామ్‌తో తన తర్వాతి ప్రాజెక్ట్ చేసే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్‌కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే ఓ చిరుకు ఓ కథను వినిపించాడట. చిరు మాత్రం ఈ స్టోరీ లైన్‌ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. ఇక ప్రశాంత్ వర్మ.. రీసెంట్గా దర్శకత్వంలో ‘జాంబి రెడ్డి’ సినిమా విడుదలై హిట్ అందుకుంది.