Chiranjeevi - Waltair Veerayya Censor Talk Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంసెన్సార్ పూర్తి చేసుకుంది. దాంతో పాటు రన్ టైమ్ ఎంతనేది మూవీ మేకర్స్ ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్‌ను మీడియాకు విడుదల చేశారు.
వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరు వేసిన స్టెప్పలు కూడా సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. మొత్తంగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్‌గా ఉండనుందని టాక్. (Twitter/Photo)
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో *వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యా.యి. శ్లోక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు అక్కడ రిలీజ్ చే'స్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ జనవరి 12 వేయనున్నట్టు ప్రకటించారు. Photo : Twitter
వాల్లేరు వీరయ్య సినిమాను యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో అదే టైటిల్‌తో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే హిందీలో విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. (Twitter/Photo)
వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి పాత్రలో నటిస్తే.. చిరు.. వాల్తేరు ప్రాంతానికి చెందిన వీరయ్యగా కనిపించనున్నారు. సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఇటీవల రవితేజకు సంబంధించిన టీజర్ విడుదలై కేక పెట్టించింది. తెలంగాణ యాసలో ఆయన వావ్ అనిపించారు.
ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి. విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ చిత్రాలు జనవరి 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఇక చిరు మూవీ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రానుంది. దీంతో పాటు మరో రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో లైన్లో ఉన్నాయి. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో..
ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు ఒకప్పటి నటి సుమలత కూడా నటించనున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రవితేజ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter